తెలంగాణ వీణ , జాతీయం : ఇటీవల తమిళనాడులో కొందరు సామాన్యుల బ్యాంక్ ఖాతాల్లో హఠాత్తుగా వందల కోట్ల రూపాయలు జమ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఫార్మసీ కార్మికుడిగా పనిచేస్తున్న మరో వ్యక్తి ఖాతాలో శనివారం ఏకంగా రూ.753 కోట్లు కన్పించడంతో అతను షాక్ తిన్నాడు.
మహమ్మద్ ఇద్రీస్ అనే కార్మికుడు శుక్రవారం తన బ్యాంకు ఖాతా నుంచి మిత్రుడికి రూ.2 వేలు పంపాడు. తర్వాత బ్యాలెన్స్ పరిశీలించగా రూ.753 కోట్లు చూపెట్టింది. దీంతో విషయాన్ని వెంటనే బ్యాంక్ అధికారులకు చెప్పడంతో ఖాతాను స్తంభింపచేశారు.