తెలంగాణ వీణ, సిటీబ్యూరో : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను నవంబర్ 30న నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణతో పాటు మిజోరం, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించి డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది.
నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలు ప్రారంభం… నవంబరు 3
నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ: నవంబరు 10
నామినేషన్ల స్క్రూటినీ: నవంబరు 13
నామినేషన్ల ఉప సంహరణ తుది గడువు: నవంబరు 15
ఎన్నికల తేదీ: నవంబరు 30
ఫలితాల వెల్లడి: డిసెంబరు 03