తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ యువనేత నారా లోకేశ్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తనదైన శైలిలో కామెంట్లు చేశారు. తన తండ్రి ఇప్పట్లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు రాలేడనే విషయం లోకేశ్ కు అర్థమయిందని ఆయన అన్నారు. తనకు కూడా అదే గతి తప్పదేమోనని లోకేశ్ భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. యువత కోసమని మొదలు పెట్టిన యాత్రను నాన్న కోసం మధ్యలోనే వదిలేశాడని అన్నారు. తానున్నానని క్యాడర్ కు ధైర్యం చెప్పాల్సింది పోయి ఢిల్లీలోని అత్యంత లగ్జరీ హోటల్లో బస చేస్తున్నాడని విమర్శించారు. ‘కుల గురువు’ అన్నట్టు కాలమహిమ అంటే ఇదేనేమో అని వ్యాఖ్యానించారు