తెలంగాణ వీణ, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోటి రూపాయల విలువైన 1600 గ్రాముల గోల్డ్‌ను సీజ్ చేశారు. బంగారాన్ని డిటర్జెంట్ సర్ఫ్‌లో దాచి తరలించే యత్నం చేశారు కేటుగాళ్లు. జెడ్డా, దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. దర్యాప్తు చేస్తున్నారు.