తెలంగాణ వీణ, హైదరాబాద్ : మల్కాజిగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అవిర్భవం నుంచి జెండాలు మోసిన ఉద్యమకారులకు పార్టీ మెండి చేయి చూపిస్తోందని ఉద్యమ కారుడు యాప్రాల్ సాయికుమార్ విమర్శించారు . పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అణిచివేతకు గురవుతునే ఉన్నామనీ ఉద్యమంలో పనిచేసి పార్టీ జెండాలు మోసిన వారిని గుర్తించకుండా ఇతర పార్టీలనుంచి వచ్చిన వారకే పదవులు కట్టబెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో నామినేషన్ ఉపసంహరించుకోవాలని పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్ ,ఈటెల రాజేందర్, పద్మా దేవేందర్ రెడ్డి అప్పటి ఎమ్మెల్యే కనకారెడ్డి తో పాటు ఇంచార్జ్ గావ్యవహరించిన పుట్ట మధుల సమక్షంలో తగిన నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదు తిరిగి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మైనంపల్లి హనుమంతరావు నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తామన్నారు, పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లయిన ఇంతవరకు తమకు తగిన గుర్తింపు లభించడంలేదన్నారు. ఉద్యమ నేతలను అణిచివేతకు గురిచేస్తూ వస్తున్నా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటునే ఉన్నామన్నారు . ఇప్పటికైనా తమకు తగిన గుర్తింపు ఇవ్వకపోతే తమ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో ప్రకటిస్తామన్నారు. ఇప్పటికైనా పార్టీ అదిష్టానం గుర్తించకపోతే తమపోరాటాన్ని మరింత ఉదృతం చేసినందుకు వెనుకాడ బోమన్నారు .ఈ కార్యక్రమంలో బూడిద నరసింహ గౌడ్ ,మండల శ్రవణ్ గౌడ్ , జి రమేష్, మురళి, రామ్ రెడ్డి ,నందకిషోర్ ,రాజశేఖర్ ,చంద్రమౌళి ,శ్రావణి, చందన ,లలిత, లక్ష్మీ, నవీన్ ,లు పాల్గొన్నారు.