తెలంగాణ వీణ, సిటీబ్యూరో : దసరా సెలవు తేదీలో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సెలవును అక్టోబరు 23వ తేదీకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అక్టోబరు 24వ తేదీని కూడా సెలవుదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది దసరా పండుగ విషయంలో కాస్త సందిగ్ధం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో 23 అని, మరి కొన్ని ప్రాంతాల్లో 24వ తేదీ అంటూ ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్వత్ సభ ఈ నెల 23న దసరా పండుగ జరుపుకోవాలని ఇటీవల స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా దసరా సెలవును ఈ నెల 24 నుంచి 23కు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణలో దసరా సెలవులు ఈ నెల 24, 25 కు బదులుగా ఈ నెల 23, 24కు మార్చింది ప్రభుత్వం.