తెలంగాణ వీణ, సినిమా : వినూత్న డ్రెస్ లు ధరించి నిత్యం మీడియాలో ఉండే బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ తాజాగా ప్రముఖ బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాపై మండిపడ్డారు. తన డ్రెస్ సెన్స్ పై కుంద్రా చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇతరుల దుస్తులు విప్పి డబ్బులు సంపాదించే వ్యక్తి కూడా తను వేసుకునే డ్రెస్ గురించి మాట్లాడుతున్నాడంటూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ రాజ్ కుంద్రాపై ఉర్ఫీ ఎందుకు మండిపడుతున్నారంటే..పోర్న్ వీడియోలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా ఇటీవలి కాలంలో ఫేస్ మాస్క్ ధరించి కానీ బయటకు రావడంలేదు. బయట ఎక్కడ కనిపించినా ఆయన ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ఉంటోంది. ఇటీవల వినాయక చవితి సందర్భంగా, భార్య కొడుకుతో కలిసి నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్నపుడు కూడా రాజ్ కుంద్రా ముఖానికి మాస్క్ ఉంది. మీడియా ప్రతినిధులు ఈ మాస్క్ గురించి పదే పదే ప్రశ్నలు సంధించడంతో కుంద్రా అసహనంగా ఫీలవుతున్నారు.