తెలంగాణ వీణ, క్రీడలు : భారత పురుషులు, మహిళల జట్లు కబడ్డీలో ఫైనల్స్‌కు దూసుకెళ్లి రెండు పతకాలు ఖాయం చేశాయి. పురుషుల విభాగంలో భారత్ 61-14 పాయింట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుచేసింది. గత క్రీడల్లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్న భారత పురుషుల జట్టు ఈసారి అంతకుమించిన ప్రదర్శనతో ఫైనల్ చేరి కనీసం రజతం ఖాయం చేసుకుంది. మహిళల సెమీ్‌సలో భారత్ 61-17తో నేపాల్‌ను ఓడించి వరుసగా నాలుగోసారి ఫైనల్లో ప్రవేశించింది. ఆదివారం జరిగి టైటిల్ ఫైట్‌లో భారత పురుషుల జట్టు ఇరాన్‌తో, మహిళల బృందం చైనీస్ తైపీతో తలపడనున్నాయి.రోలర్ స్కేటర్లు గ్రీష్మ దొంతర, సాయి సంహిత ఆకుల పతక రేసులో నిలిచారు. శుక్రవారం జరిగిన లేడీస్ ఆర్టిస్టిక్ సింగిల్ ఫ్రీ స్కేటింగ్ షార్ట్ ప్రోగ్రామ్ ఫైనల్స్‌లో గ్రీష్మ 20.94 స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచింది. 16.95 స్కోరు చేసిన సంహిత ఆరో స్థానంలో నిలిచింది. శనివారం జరిగే ఫైనల్ రౌండ్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తే వీరిద్దరూ పతకాలు గెలిచే చాన్సుంది.సాఫ్ట్ టెన్ని్‌సలో భారత క్రీడాకారులు రాగశ్రీ, జై మీనా సింగిల్స్‌లో జోరు కొనసాగిస్తున్నారు. మహిళల సింగిల్స్ గ్రూప్-ఎ్‌ఫలో రాగశ్రీ వరుసగా మెంగ్‌చూయి (కంబోడియా)పై, తి మై హువాంగ్ పై.. పురుషుల సింగిల్స్‌లో గ్రూప్-ఏలో యు సున్ చెన్ ఫై, హర్లీ పై జై మీనా గెలిచి క్వార్టర్స్ చేరారు