తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం నిర్మాణ బాధ్యతను టీడీపీ ప్రభుత్వం నెత్తినెత్తుకుని తప్పు చేసిందని సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఆయన శనివారం శ్రీసత్యసాయి జిల్లా నీలకంఠాపురంలో విలేకరులతో మాట్లాడారు.
వైఎస్సార్ కృషితోనే పోలవరం ప్రాజెక్టు రూపుదిద్దుకుందనేది జగమెరిగిన సత్యమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మతతత్వ బీజేపీ ఓడిపోతేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశానికి ‘ఇండియా’ కూటమి అవసరం చాలా ఉందని చెప్పారు. ఈ నెల 9న ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుందని తెలిపారు.