తెలంగాణ వీణ, భద్రాద్రి కొత్తగూడెం : మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గురజాల గోపి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ డిసిసి అధ్యక్షుడు తన మీద సస్పెండ్ ఆర్డర్ రిలీజ్ చేయడం అనేది డీసీసీ చేతుల్లో లేదని తానేమైనా తప్పు చేస్తే క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేయాలని షోకాజు నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ ఎలా చేస్తారని అన్నారు. గతంలో కూడా తన మీద అధిష్టానానికి ఫిర్యాదు చేశారని అది తప్పుడు ఫిర్యాదు అనే విషయాన్ని అధిష్టానం గుర్తించిందని తెలిపారు. మణుగూరులో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తిని తానేఅని గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ ఆఫీసు పెట్టి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను అని అన్నారు. నేనేమీ తప్పు చేశానో బహిరంగంగా చెప్పాలని తెలిపారు గతంలో కూడా చాలామంది సీనియర్ నాయకులను పొదెం వీరయ్య గారు సస్పెండ్ చేశారని ఆ కాగితాలు చెత్తకుప్పల్లోకి వెళ్లాయని గుర్తు చేశారు. కొంతమంది చెప్పుడు మాటలు విని తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం మానుకోవాలని లేనిపక్షంలో అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు సీనియర్ నాయకులు పింగళి మాధవరెడ్డి ,మలోత్ కిషన్ నాయక్ , ఎస్ కే షాబీర్ తదితరులు పాల్గొన్నారు.