తెలంగాణ వీణ, క్రీడలు : ఆసియా క్రీడల్లో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి శత పతకాలు సాధించింది. ఇవాళ మహిళల కబడ్డీ ఫైనల్‌లో చైనీస్ జట్టును చిత్తు చేస్తూ భారత్ స్వర్ణంతో మెరిసింది. అలాగే ఆర్చరీ ఈవెంట్‌లో మొత్తం నాలుగు పతకాలను భారత్ కైవసం చేసుకుంది. ఆర్చరీ మహిళల విభాగంలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ పసిడి పట్టేసింది. ఇదే అర్చరీ విభాగంలో అదితి గోపీచంద్ కాంస్యం సాధించింది. మరోవైపు ఆర్చరీ పురుషుల విభాగంలో ఓజాస్ డియోటేల్ స్వర్ణం గెలుచుకోగా.. అభిషేక్ రజతం సాధించాడు. దీంతో ఇప్పటివరకు భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 100కి చేరింది. ఇందులో స్వర్ణం- 25 రజతం- 35 కాంస్యం- 40 పతకాలు ఉన్నాయి. దీంతో ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 4 స్థానంలో కొనసాగుతోంది.ఆసియా గేమ్స్‌లో మహిళల కబడ్డీలో భారత్‌కు స్వర్ణం పతకాన్ని సాధించారు. మహిళల కబడ్డీ ఫైనల్‌లో చైనీస్‌పై భారత్ విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో చైనీస్ తైపీపై విజయం సాధించి రికార్డు సృష్టించింది. చివరి నిమిషంలో 26-25 తేడాతో భారత మహిళల జట్టు విజయం సాధించారు. ఆసియా గేమ్స్ హాకీలో భారత పురుషుల జట్టు స్వర్ణం చేజిక్కించుకుంది. చైనాలోని హాంగ్ ఝౌలో ఇవాళ జరిగిన ఫైనల్లో భారత్ 5-1తో జపాన్ ను ఓడించి ఆసియా క్రీడల హాకీ విజేతగా నిలిచింది. అంతేకాదు, ఈ ఘనవిజయంతో పారిస్ ఒలింపిక్స్ బెర్తును కూడా భారత్ ఖరారు చేసుకుంది.