తెలంగాణ వీణ, కుత్బుల్లాపూర్ : దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గవర్నమెంట్ స్కూల్ లో ఎర్పాటుచేసిన అల్ఫహర పథకం కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా కమీషనర్ అండ్ డైరెక్టర్ అఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పమిలా సత్పతి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, ఎమ్మెల్యే కే పి వివేకానంద్ తో కలిసి జ్యోతి ప్రజ్వాళన చేసి మొక్కలు నాటి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకంతో ఎంతోమంది పేద పిల్లలకు మంచి పౌష్టిక ఆహారాన్ని అందించి వారి భవితవ్యానికి నాంది పలికిన వారు అవుతరన్నారు.. ఈ తరం పిల్లలు సి.ఎం కేసిఆర్ స్ఫూర్తి తో మరింత ముందుకు వెళ్లి జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం స్కూల్ పిల్లలకు స్వయంగా వడ్డించి పిల్లలతో కలిసి అల్ఫహరాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో దుండిగల్ కమీషనర్ కె సత్యనారాయణ, కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులూ, స్కూల్ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు..