తెలంగాణ వీణ, కుత్బుల్లాపూర్ : జీడిమెట్లలో సూపర్ మాక్స్ బ్లేడ్ల కంపెనీ వారు గత కొన్ని నెలలుగా ఉద్యోగస్తులకు వేతనాలు చెల్లించనందున ఉద్యోగుల జీవనం అస్తవ్యస్తంగా మారడంతో వారు ధర్నా చేపట్టారు. వారికి మద్దతుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సీనియర్ సీపీఎం మండల కార్యదర్శి కిలు కానీ లక్ష్మణ ధర్నాలో పాల్గొని వారికి సీపీఎం పార్టీ తరుపున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు తక్షణమే చెల్లించాల్సిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసారు.సీపీఎం కార్యదర్శి కిలుకాని లక్ష్మణమాట్లాడుతూ ఈ BRS ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. స్థానిక ఎమ్మెల్యేకు గత కొన్ని నెలలుగా ఉద్యోగులు పడుతున్న కష్టాలు కనపడ్డాడం లేదా అని ప్రశ్నించారు. సూపర్ మాక్స్ కంపెనీ ఉద్యోగులను ఆదుకుంటామని తెలిపారు e కార్యక్రమంలో సీపీఐ కుత్బుల్లాపూర్ సెక్రటరీ ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.