తెలంగాణ వీణ, కుత్బుల్లాపూర్ : దుండిగల్,కైసర్ నగర్, నిజాంపేట్ లోని 3142 డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించిన 3నియోజకవర్గాలలోని లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను హోం మినిష్టర్ మహమ్మద్ అలీ పంపిణీ చేసారు..ఈ కార్యక్రమంలో ఎంఎల్ సి శంభీపూర్ రాజు ,ఎంఎల్ఎ వివేకానంద, మాధవరం క్రిష్ణారావు..డిప్యూటీ కలెక్టర్ తదితర అధికారులు పార్టీ నాయకులు పాల్గొన్నారు..14ఏళ్లు ఉద్యమంలో మడమ తిప్పకుండా పెద్ద పెద్ద పార్టీల నేతలను తట్టుకుని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు మన కేసిఆర్ అని హోం మినిష్టర్ మహమ్మద్ కొనియాడారు.. రాష్ట్రం సిద్దించిన తర్వాత కేసిఆర్ పాలనలో ఇండియా లోనే అన్ని రంగాల్లో అభివృద్ధి పరంగా నెం1గా వెలుగులు జల్లుతున్న రాష్ట్రంగా తెలంగాణా వెలిగిపోతుందన్నారు..తెలంగాణ వ్యాప్తంగా ప్రజలంతా బిఆర్ఎస్ పార్టీతో సంతోషంగా ఉన్నారన్నారు..దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి ప్రతినిధులు వచ్చి తెలంగాణ డెవలప్మెంట్,హైదరాబాద్ హంగులు చూసి తెలంగాణ లోఉన్నమా లేక సింగపూర్ మలేషియా లో ఉన్నామా అని కొనియాడుతుంటే ప్రతి తెలంగాణ పౌరుడి గుండె ఉప్పొంగుంతుందన్నారు.కళ్యాణలక్ష్మీ,షాదీ ముభారక్ ఇంటింటికి నీళ్లు,రైతుబందు రైతుభరోసా లతో పాటు పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూంలు ఎలాంటి పైరవీలకు తావులేకుండా ర్యాండమైజేషన్ తో ఒక్క రుపాయిఖర్చు లేకుండా అందిస్తున్నారు..తెలంగాణ వ్యాప్తంగా రైతాంగంతో పాటు ఇండస్ట్రీయలిస్టులతో పాటు అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారన్నారు…హైదరాబాద్ లో 1లక్ష డబుల్ బెడ్రూంల కట్టించి ఫ్రీగా పేద ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వం కేసిఆర్ ప్రభుత్వం అన్నారు..రాష్ట్రం సిద్దించిన 10ఎళ్లల్లో సియం కేసిఆర్ హయంలో ఎంతో గణత సాగించిందన్నారు.కాంగ్రెస్ లాంటి స్కామ్,బిజెపి లాంటి పార్టీలను తెలంగాణ రాష్ట్రం నుండి తరిమికొట్టార్తని,, కర్ణాటక లో కాంగ్రెస్ మైనారిటీ వర్గాలు వలన గెలిచాయని,,,ఇక్కడ మైనారిటీలు ఎంతో తెలివిగలవారని,,,వారు అభివృద్ధి వైపు చూస్తూన్నారని,,, మరోమారు బిఆర్ఎస్ పార్టీని నెలకొల్పుకుంటే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాదించి బంగారు తెలంగాణ గా సిద్దింఛేందుకు అవకాశం ఉందన్నారు..తెలంగాణరాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఉంటేనే శ్రీరామ రక్ష అన్నారు..మరోసారి సియం గా కేసిఆర్ ను చేసుకుని రాష్ట్రాన్ని మరింత డెవలప్మెంట్ ను చేసుకుందామన్నారు..