Friday, November 8, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఎల్లుండి తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌.

Must read

తెలంగాణ వీణ , జాతీయం : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో ఇవాళ భేటీ కానుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే సమీక్షలు పూర్తి చేసిన ఈసీ ఓ అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాలకు ఒకే విడతలో.. ఒక రాష్ట్రానికి మాత్రం రెండు విడుతలుగా పోలింగ్‌ నిర్వహించాలని భావిస్తోందని సమాచారం.

తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , చత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. పోలీస్, జనరల్ , ఎక్సపెండేచర్ పరిశీలకులు ఈ భేటీకి హాజరు కానున్నారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు వ్యూహాన్ని ఖరారు చేసేందుకే ఈ భేటీ నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.

ఇక.. ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరాంలలో ఒకే విడత పోలింగ్‌లో ఎన్నిక నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. అలాగే.. ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించాలనుకుంటోంది. ఇక డిసెంబర్‌ 10-15 తేదీల మధ్య ఓట్ల కౌంటింగ్‌ నిర్వహించేందుకు ఈసీ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు ఉపయోగించే మద్యం , డబ్బు.. నియంత్రణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తమ అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేయడంతో పాటుగా డబ్బు, మజిల్ పవర్ నియంత్రణకు కృషిచేయాలని పరిశీలకులకు సూచించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 8-10 తేదీల మధ్యలో.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you