తెలంగాణ వీణ, సినిమా : విక్టరీ వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం సైంధవ్. శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మాణంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. జనవరి 13న పండుగకు ఒక రోజు ముందు సైంధవ్ రాబోతున్నాడు అంటూ తాజా పోస్టర్ విడుదల చేశాడు. ఈ పోస్టర్‌లో వెంకటేష్, బేబీ సారాతో కనిపించారు. వెంకటేష్‌కు సంక్రాంతి మోస్ట్ సక్సెస్ ఫుల్ సీజన్.గతంలో కూడా ఆయన నటించిన ఎన్నో చిత్రాలు సంక్రాంతికి విడుదలై సక్సెస్ సాధించాయి. చాలాకాలం తర్వాత వెంకీ చిత్రం సంక్రాంతి సీజన్ విడుదల కానుంది. వరుస సెలవులు సినిమాకు బాగా కలిసొస్తాయని మేకర్స్ అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని ఎనిమిది పాత్రలు వెంకటేష్, నవాజుద్దీన్ సిద్థిఖీ, ఆర్య, శ్రద్థా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరేమియా, సారా, జయప్రకాష్ డిఫరెంట్ పోస్టర్ల ద్వారా పరిచయమయ్యారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల కానుంది.