తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దాం అంటూ రేపు (శనివారం) వినూత్న నిరసనకు తెలుగుదేశం నిర్ణయించింది. ఈ క్రమంలో తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara lokesh) సమావేశమై… కార్యక్రమం నిర్వహణపై చర్చిస్తున్నారు. రేపు రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆర్పి, ఇంటి బయట సెల్ ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించి 5 నిమిషాల పాటు నిరసన తెలపాలని నిర్ణయించారు. రోడ్డుపై వాహనాల్లో ఉంటే వాహన లైట్లు బ్లింక్ కొట్టాలని నిర్ణయించారు. శాంతియుత నిరసన కార్యక్రమం రాష్ట్రమంతటా నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. మోత మోగిద్దాం కార్యక్రమానికి ప్రజల నుంచి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని లోకేష్ దృష్టికి నేతలు తీసుకొచ్చారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన ఓర్వలేకే శాంతియుత నిరసన నిర్వహణపైనా అక్రమ కేసులు పెట్టారని నేతలు మండిపడుతున్నారు.