తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : అమరావతి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజమండ్రి బయలుదేరారు. నేటి మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబుతో నారా లోకేష్, కుటుంబసభ్యులు ములాఖత్ కానున్నారు. గత రాత్రి ఢిల్లీ నుంచి లోకేష్ అమరావతి చేరుకున్నారు. పార్టీకి సంబంధించి చంద్రబాబుతో పలు అంశాలను చర్చించనున్నారు. జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు టీడీపీ సభ్యుల ను చంద్రబాబు, లోకేష్ ఖరారు చేయనున్నారు. మోతమోగిద్దాం తరహాలో రేపు శనివారం మరో వినూత్న కార్యక్రమానికి తెలుగుదేశం ఆలోచనలు చేస్తోంది. కార్యక్రమం నిర్వహణకు పార్టీ ముఖ్య నేతల అభిప్రాయాలను లోకేష్ తీసుకుంటున్నారు. లోకేష్ వెంట రామ్మోహన్ నాయుడు, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, గంటి హరీష్, ఆదిరెడ్డి వాసు, వైవీబీ రాజేంద్రప్రసాద్, ఇంటూరి నాగేశ్వరరావు, భాష్యo ప్రవీణ్, బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు రాజమండ్రి బయలుదేరారు