చంద్రబాబును ఎదుర్కోలేకే అక్రమ అరెస్టు
తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు రాజ్యాంగ విరుద్ధంగా అరెస్టు చేశారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా గురువారం బనగానపల్లె పట్టణంలో బీసీ జనార్దన్‌రెడ్డితో పాటు టీడీపీ కమ్మ సంఘం నాయకులు దీక్షలో పాల్గొన్నారు. రామకృష్ణాపురం శంకర్, మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు, కత్తి రామదాసు, సండ్రాసురేష్, చల్లానరసయ్య, కె.రఘు, పుల్లయ్య, చంద్రుడు, దబ్బర సత్యం తదితరులు పాల్గొన్నారు. బీసీ మాట్లాడుతూ సీఎం జగన్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. పోలీసులు, సీఐడీ అధికారులు వైసీపీకి తొత్తులుగా మారారన్నారు. టీడీపీ కార్యకర్తల సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎం జగన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీక్షలు చేపట్టిన వారికి కొలిమిగుండ్ల, అవుకు, సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం ప్రకటించారు. బీసీ రామనాథరెడ్డి, రంగయ్యనాయుడు, రంగమయ్య నాయుడు తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింప చేశారు.
డోన్: వచ్చే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు గద్దె దింపడం ఖాయమని టీడీపీ డోన్ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఆద్వర్యంలో చేపట్టిన బాబుతో నేను నిరాహార దీక్షలో హెచ్.కొట్టాల గ్రామానికి చెందిన మహిళలు కూర్చున్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు, స్కాములు రాజ్యమేలుతున్నాయని అన్నారు. వైసీపీ అరాచక పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు పోరాటం చేస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చారన్నారు. వైసీపీ పునాదులు కదులుతుండటంతో చంద్రబాబు పై అక్రమ కేసులతో జైలులో నిర్బంధించడం చాలా దారుణమన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడు, పార్టీ డోన్ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్, పోలూరు వెంకటేశ్వరరెడ్డి, ప్యాపిలి మండల అధ్యక్షుడు గండికోట రామసుబ్బయ్య, ధర్మవరం గౌతమ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పద్మావతమ్మ, ఎస్ఎండీ రఫీ, మిద్దెపల్లి గోవిందు, గోవిందరెడ్డి, నాగమణి, జ్యోతి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో సైకో సీఎంగా పేరు తెచ్చుకున్న జగన్‌కు ప్రజల చేతుల్లో పతనం తప్పదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన బాబుతో మేము నిరాహారదీక్షలో కూర్చున్న మహిళలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. సంపద సృష్టించే చంద్రబాబుపై ఆర్థిక నేరగాళ్ల పాలనలో అక్రమ కేసులు పెట్టి జైలులో నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో నిరుద్యోగ యువతను వైసీపీ ప్రభుత్వం వంచించిందని డోన్ నియోజకవర్గ టీడీపీ నాయకులు ధర్మవరం పెద్దనాగిరెడ్డి, పార్టీ పట్టణ అద్యక్షుడు సీఎం శ్రీనివాసులు అన్నారు. గురువారం పట్టణంలోని సుందర్‌సింగ్ కాలనీలో టీడీపీ ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ కరపత్రాలను పంపిణీ చేశారు. నాయకులు జలదుర్గం విష్ణు, మధుసూదన్ రెడ్డి, ఉడుములపాడు నాగేంద్ర, ధను, రఘు, కొచ్చెర్వు రామాంజినేయులు, గంధం చరణ్, ఆచారి పాల్గొన్నారు.
బేతంచెర్ల: టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా జైలులో ఉంచడం దారుణమైన చర్య అని టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్షావలి చౌదరి అన్నారు. గురువారం సాయంత్రం బాబుతో మేము సైతం కార్యక్రమంలో భాగంగా బేతంచెర్ల నగర పంచాయతీ వడ్డెపేట కాలనీలో బాబుతో మేము కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. క్రిస్టియన్ టీడీపీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మేకల నాగరాజు, రూబన్, నంద్యాల మధు, నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ, మల్లిపెద్ది నాగేశ్వరరెడ్డి, కానాల అంజి, తదితరులు పాల్గొన్నారు.
చాగలమర్రి: రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్సర్‌బాషా అన్నారు. గురువారం చాగలమర్రి గ్రామంలోని టీడీపీ కార్యాలయం వద్ద నేను సైతం బాబు కోసం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ నాయకులు సంతకాలు చేసి చంద్రబాబు వెంటే తాము అంటూ నినాదాలు చేశారు. అన్సర్‌బాషా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా కక్షసాధింపుతో అరెస్టు చేసిందని అన్నారు. టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి గుత్తి నరసింహులు, టీడీపీ నాయకులు కొలిమిఉసేన్వలి, కొలిమి షరిఫ్, మౌళాలి, అనిఫ్, మాబులాల్, వేణుగోపాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మదార్సా, అమీర్, రమేష్, బషీర్, కొండయ్య, అజిమ్, ఇర్షాద్, ఖలీల్, ఉసేన్‌పీరా, మహబూబ్‌బాషా ఉన్నారు.
శిరివెళ్ల: రాష్ట్రంలో వైసీపీ నాయకులు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తూ.. ప్రజల పక్షాన నిలబడిన టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించారని మాజీ ఎంపీటీసీ, బెస్త సాధికార సంఘం నాయకుడు కొండబోయిన బాలచంద్రుడు అన్నారు. రాజకీయ కక్షతో చంద్రబాబుపై పెట్టిన కేసులను ఖండిస్తూ ‘బాబుతో నేను’ కార్యక్రమంలో భాగంగా శిరివెళ్లలోని తెలుగుపేటలో గురువారం పర్యటించి వైసీపీ ఆగడాలను ప్రజలకు వివరించారు. నైపుణ్య శిక్షణ కేంద్రాలతో వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం, జగన్ ప్రభుత్వ అక్రమాలు, అవినీతిని ఎండగట్టడం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం రేయింబవళ్లు శ్రమిస్తుండడమే చంద్రబాబు చేసిన నేరమా..? అని ఆయన ప్రశ్నించారు. నాయకులు కొండబోయిన ధీరజ్, సుంకి శివానంద్, కొండబోయిన జగదీష్, నవీన్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని యర్రగుంట్ల మాజీ సర్పంచ్ కమతం పుల్లారెడ్డి, టీడీపీ నాయకుడు కమతం లక్ష్మీరెడ్డి అన్నారు. మండలంలోని యర్రగుంట్ల గ్రామంలో బాబుతో నేను అంటూ వైసీపీ అరాచకాలను గురువారం ప్రజల్లోకి తీసుకెళ్లారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా యర్రగుంట్ల-2 ఎంపీటీసీ కమతం జయరామిరెడ్డి, బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శీలం లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు. టీడీపీ నాయకులు తాళ్లూరి బుగ్గన్న, జాకీర్ హుసేన్, శీలం నరసింహ, షఫి, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.