తెలంగాణ వీణ, భద్రాద్రి కొత్తగూడెం : అశ్వాపురం మండలం లోని రైతు వేదిక నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ 22 మంది లబ్ధిదారులకు 22 లక్షల రూపాయల విలువగల చెక్కులు పంపిణీ చేసినారు దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ & స్థానిక ఎమ్మెల్యే& భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.అనంతరం మండలం లో ని మార్కెట్ యార్డు లో సి సి రోడ్డు శంఖు స్థాపన చేశారు. ఈ కార్యక్రమము లో జెడ్ పి టి సి సూది రెడ్డి సులక్షణ వైఎస్ యం పి పి కంచుకట్ల వీరభద్రం. బి ఆర్ యస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్. తహశీల్దార్ రమాదేవి. MPDO వరప్రసాద్. సర్పంచ్ లు యం పి టి సి లు అదికారులు బి ఆర్ యస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భూర్గంపహడ్ మార్కెట్ కమిటీ సెక్రటరీ నిర్మల పాల్గొన్నారు.