తెలంగాణ వీణ , హైదరాబాద్ : బీఆర్ఎస్ సర్కార్‌ను ఉద్దేశించి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. తాజాగా ఇదే అంశాన్ని గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు.
‘‘కేసీఆర్! మీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా?, అదే తెలంగాణలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా?, ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ సందర్భంలో.. మీ సర్కారును కూలదోస్తామన్న కుట్రదారు హైదరాబాద్ వచ్చిండటగా?, ఇన్నాళ్లు అడ్రస్ దొరకలేదని తప్పించుకుంటిరి. మరి ఇప్పుడైనా ఆయన్ని అరెస్టు చేసే దమ్ముందా?, ఆ కట్టుకథను ప్రజలు మర్చిపోతారులే అని అతిథ్యమిస్తారా? లేక సిట్‌ను నిద్రలేపి అరెస్టేమైనా చేస్తారా?, తెలంగాణ చూస్తోంది… మీ సమాధానం కోసం..!!.’’ అంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రేవంత్ ట్వీట్ చేశారు.