తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ, జనసేన కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తర నియోజక వర్గంలో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగు దేశం శ్రేణులు విన్నూత రీతిలో నిరసన చేపట్టారు. సంకెళ్లు వేసుకుని టీడీపీ నేతల నిరసన తెలిపారు. దీనికి జనసేన నేతలు మద్దతు తెలిపారు. గంటా శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్రంలోనే కాదు. దేశ, విదేశాల్లో వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ అరెస్టును గుర్తు చేస్తూ సింబలిక్‌గా జైల్ సెల్లో చేతికి సంకెళ్లు వేసుకుంటూ నిరసన తెలుపుతున్నాం. జగన్ ఆర్థిక నేరస్తుడు. 16 నెలలు జైల్లో ఉన్నారు. 10 సంవత్సారాల నుంచి బైయిల్ మీద ఉన్న వ్యక్తి.. 5 సంవత్సరాల నుంచి కోర్డు మెట్లు ఎక్కని వ్యక్తి జగన్. నిప్పులాంటి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కుట్రలు, కుతాంత్రాలు చీల్చుకొని చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు, లోకేష్ యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారు.’’ అని గంటా ధ్వజమెత్తారు.