Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

బీజేపీ లేవదు.. కాంగ్రెస్‌ గెలవదు

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చిందని, ఇవాళ కాకపోతే రేపైనా విచారణ జరుగుతుందని, ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తేల్చి చెప్పారు. బుధవారం కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గిలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌, మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి 50 పడకల సర్కారు దవాఖానను ప్రారంభించడంతోపాటు అంబేద్కర్‌ భవన్‌, ముదిరాజ్‌ భవన్‌లకు శంకుస్థాపన చేశారు. అనంతరం కోస్గిలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మైదానంలో నిర్వహించిన ప్రగతి నివేదిన సభలో మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బీఆర్‌ఎస్‌ పార్టీదే అధికారం అని, హ్యాట్రిక్‌ ముఖ్యమంత్రి కేసీఆరేనని చెబుతున్నాయని పేర్కొన్నార

బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్‌ గెలిచేది లేదని జోస్యం చెప్పారు. గెలిచేది.. వచ్చేది బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమేనని, ఇందులో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి కింద పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ. సాయం చేస్తున్నామని తెలిపారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని, ఆలోచించి ఓటేయకుంటే గోసపడతారని హెచ్చరించారు. ప్రభుత్వ దవాఖానల్లో పైసా ఖర్చు లేకుండా కాన్పు చేయడంతోపాటు తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి పంపిస్తున్నట్టు పేర్కొన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇస్తున్నది రూ. 600
తాము అధికారంలోకి వస్తే రూ. 4 వేల పింఛన్‌ ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్‌ పార్టీ.. కర్ణాటకలో రూ.600 పింఛన్‌, మూడు రోజులకు ఒకసారి తాగునీరు ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు. రేవంత్‌ చెబుతున్నట్టు మూడు గంటల కరెంటు కావాలంటే కాంగ్రెస్‌కు, 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈసారి కోస్గిని రెవెన్యూ డివిజన్‌ చేయడంతోపాటు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ప్రతి ఎకరాలో సాగునీరు పారిస్తామని భరోసానిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామని, ఎస్టీలకు విద్య, ఉద్యోగావకాశాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పించామని, పనిచేసే ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు.

బీఆర్‌ఎస్‌కు పోటీ లేదు
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి పోటీ అన్నదే లేదని రాష్ట్ర గనులు, భూగర్భవనరులశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, బీజేపీ ఉనికిని కోల్పోయిందని విమర్శించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా దళితబంధు, బీసీ బంధు, గొర్రెల పంపిణీ, కల్యాణలక్ష్మి తదితర పథకాలను కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. బీఆర్‌ఎస్‌ మూడోసారి అధికారంలోకి రావడం పక్కా అని, కొడంగల్‌ ఎమ్మెల్యేగా నరేందర్‌రెడ్డి రెండోసారి గెలవడం ఖాయమని మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీఎస్‌ఎండీసీ కార్పొరేషన్‌ చైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట జిల్లా వైద్యరంగానికి కొత్త ఊపిరి
హైదరాబాద్‌, అక్టోబర్‌ 4 (నమస్తే తెలంగాణ): సిద్దిపేటలో నిర్మించిన 1000 పడకల ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన జిల్లా వైద్యరంగానికి నూతన ఊపిరులు ఊదుతుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం దవాఖానను ప్రారంభించనున్న సందర్భంగా బుధవారం సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌” ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. ‘తెలంగాణలో సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశనంలో తెల్లకోటు విప్లవం కొనసాగుతున్నది. సిద్దిపేటలో వెయ్యి పడకల ప్రభుత్వ దవాఖాన నిర్మాణం పూర్తయింది. ఇది జిల్లా వైద్యరంగానికి కొత్త ఊపిరి ఇవ్వనుంది. అత్యాధునిక వైద్యపరికరాలతో, అత్యుత్తమ వైద్యసేవలు అందించగలిగే ఈ దవాఖానను గురువారం నేను ప్రారంభించబోతున్నందుకు సంతోషంగా ఉన్నది. ప్రాథమిక వైద్యం నుంచి క్లిష్టమైన సర్జరీల దాకా ఇక్కడ చికిత్స ఉచితంగా దొరుకుతుంది. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఏర్పాటైన ఈ దవాఖాన ఆరోగ్య సిద్దిపేటను సాకారం చేస్తుంది’ అని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you