తెలంగాణ వీణ , హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిలర్ అని, డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు ఖరారు చేస్తున్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్‌రెడ్డి ఆరోపించారు. తాను అడిగిన డబ్బు ఇవ్వని వారిని సర్వేలో ఓడిపోయినట్టు తేలిందని బ్లాక్‌మెయిల్‌చేస్తున్నాడని, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు. తాను చేసిన ఆరోపణలు అబద్ధమైతే రేవంత్ వచ్చి భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. రేవంత్ మోసాల చిట్టా మొత్తం తన వద్ద ఉందని చెప్పారు. పటాన్‌చెరు టికెట్ కోసం గాలి అనిల్‌కుమార్ దగ్గర రేవంత్ రూ.12 కోట్లు తీసుకొని, ఆయనకు రెవన్యూ మంత్రి పదవి ఆఫర్ చేశారని తెలిపారు. మహేశ్వరం టికెట్ కోసం చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దగ్గర రూ.10 కోట్లు, 5 ఎకరాల స్థలం రేవంత్ తీసుకున్నారని చెప్పారు.
కల్వకుర్తి టికెట్ కోసం కసిరెడ్డి నారాయణరెడ్డి దగ్గర రూ.6 కోట్లు తీసుకున్నాడని వివరించారు. రేవంత్‌రెడ్డికి వసూళ్లు, మోసాలు కొత్తేమీ కాదని, ఓటుకు నోటు కేసులో రూ.50లక్షలు ఇస్తూ దొరికిపోయాడని గుర్తుచేశారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరుతున్న పారాచూట్ నేతలతో రాత్రికి రాత్రే బేరాలు కుదుర్చుకుని టికెట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఎక్కడ పోటీచేస్తే.. తాను అక్కడ పోటీచేసి గెలుస్తానని ధీమావ్యక్తం చేశారు. రేవంత్‌ను సస్పెండ్ చేసేంతవరకు తప పోరాటం ఆగదని చెప్పారు. రేవంత్‌ను నమ్ముకుంటే కాంగ్రెస్ ఓటమి ఖాయమని చెప్పారు. హుస్సేన్‌సాగర్ బుద్ధిడి విగ్రహం వద్ద రేవంత్‌ను సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగిన కొత్త మనోహర్‌రెడ్డి, అతడి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి పంపించేశారు.