తెలంగాణవీణ ,ఉప్పల్ : ఉప్పల్ యోజకవర్గానికి ప్రత్యేకమైన చొరవ చేసి వంద పడకల ఆసుపత్రి మంజూరు చేయించినందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి అభినందనలు తెలుపుతూ రాధిక చౌరస్తాలో ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చిత్రపటాలకు ఏఎస్ రావు నగర్ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో తాడూరు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు , డివిజన్ మాజీ అధ్యక్షులు బేతాళ బాలరాజు మురళీ పంతులు నాయకురాలు షేర్ మనెమ్మ , ప్రధాన కార్యదర్శి కుమారస్వామి,శోభా రెడ్డి, సాంబశివరెడ్డి శ్రీనివాస్ గౌడ్, శంకర్ బాబు, రాజశేఖర్ రెడ్డి, నాగరాజు, మొగులయ్య, సాంబయ్య, రమేష్ లు పాల్గొన్నారు.