తెలంగాణ వీణ , మల్కాజిగిరి : మల్కాజిగిరి నియోజకవర్గంలో ఆరు కోట్ల ఎమ్మెల్యే నిధులను వినియోగించకుండా మైనంపల్లి హన్మంతరావు చేసిన అభివృద్ది ఎమిటో తెలుస్తోందని మౌలాలీ డివిజన్ కార్పొరేటర్ సునితా శేఖర్ యాదవ్ విమర్శించారు. డివిజన్ లో జరిగిన అభివృద్దిని అడ్డుకోవంతో పాటు ప్రొటొ కాల్ పాటించకుండా అడుగడుగునా అవమాన పర్చాడనీ అందుకే తన ఉసురు తగిలిందని వ్యాఖ్యానించారు. డివిజన్ లో చేసిన అభివృద్దిని అడ్డుకుంటూ తమపై దాడులకు పాల్పడి, తప్పుడు కేసులు బానాయించారన్నారు. కార్పొరేటర్ చేసిన పనులను ఎమ్మెల్యే అభివృద్ధి అని చెబుతూ తప్పుడు ప్రచారాలు చేశాడన్నారు. తాజాగా బీజేపీ నుంచి బీఆర్ఎస్ లోకి మారుతున్నారనీ తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ ముమ్మాటికీ తాము బీజేపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. దేశం కోసం ధర్మం కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. మైనంపల్లి అనుచరులు తము పార్టీ మారుతున్నారనే ప్రచారం చేస్తున్నారనీ ఇలాంటి ప్రచారాన్ని మానుకోవాలని కార్పొరేటర్ సునితాయాదవ్ హెచ్చరించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ను తరమికొట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారనీ రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతారనిని కార్పొరేటర్ ధీమా వ్యక్తం చేశారు.