తెలంగాణ వీణ , మల్కాజిగిరి : మల్కాజిగిరి లో మైనంపల్లి హనుమంత రావు గూండా రాజకీయం చేస్తున్నాడనీ, తనను చంపుతానంటూ బెదిరింపులకు దిగుతున్నాడనీ బిజెవైఎం జాతీయ నాయకుడు సాయి ప్రసాద్ తెలిపారు. బుధవారం నేరేడ్ మెట్ సరస్వతి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన సమావేశంలో సాయ ప్రసాద్ మిడియా సమావేశం నిర్వహించారు.
మైనంపల్లి అనుచరులు, అధికారులను బెదిరిస్తూ భూ కబ్జాలకు,అక్రమాలు అరాచకాలకు పాల్పడ్డారని విమర్శించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బాధితుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేసారు. మైనంపల్లి బాధితులు ఎవరున్నా కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేస్తే తమ లీగల్ టీం వారికి పూర్తి సహకారం అందిస్తుందన్నారు. మైనంపల్లి హన్మంతరావు ప్రభుత్వం తన అనుచరులపై తప్పుడు కేసులు బనాయిస్తుందనీ చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. మల్కాజిగిరిలో మైనంపల్లి బనాయించిన తప్పుడు కేసులు కొ కొల్లలుగా ఉన్నాయనీ ఇప్పుడన్నీ కేసుల విషయాలు తేలుస్తామన్నారు. మైనంపల్లికి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటంతో పలు బెదిరింపు