తెలంగాణ వీణ , హైదరాబాద్ : రాష్ట్రంలో ని వికలాంగులకు ఫింఛన్ అందించడంతోపా టు వారికి ఉచితంగా ట్రైమోటార్‌సైకిళ్లను అం దించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషిచేస్తోం దని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేం ద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, హలింకో సంయుక్తంగా పెద ్దపల్లి నియోజకవర్గంలోని దివ్యాంగులకు ఉచి త బ్యాటరీ ఆపరేటర్ ట్రైసైకిళ్ల పంపిణీ కార్య క్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిధిగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనో హర్‌రెడ్డి హాజరై 121మంది దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటర్ ట్రై సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, జిల్లా సంక్షేమఅధికారి రౌఫ్‌ఖాన్, లయన్స్‌క్లబ్ ప్రెసిడెంట్ కోల అనిత, సుష్మ, పెద్దపల్లి సీడీ పీవో కవితతో పాటు పలు శాఖల అధికారు లు పాల్గొన్నారు.