తెలంగాణ వీణ , హైదరాబాద్ : రైతు ప్రయోజనాలను చేకూర్చేది రాష్ట్రంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అన్నారు. మంగళ వారం మండలంలోని చిన్నమెట్‌పల్లి గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆద్వర్యంలో నిర్మాణం చేసిన గోదాంను, పైడిమడుగు గ్రామంలో మహిళ సమైఖ్య భవనం, ప్రాథమిక వ్యవసాయ గోదాం, తిమ్మయ్యపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయితీ భవనం, మోహన్‌రావుపేట గ్రామంలో హెల్త్ కేంద్రం నిర్మాణాలకు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పీటీసీ సభ్యు రాలు దారిశెట్టి లావణ్య-రాజేష్, ఎంపీపీ తోట నారాయణ, రైతు సమన్యయ కమి టీ జిల్లా అధ్యక్షుడు చీటి వెంకటరావు, సింగిల్ విండో చైర్మె న్ బండి భూమయ్య, జగన్‌మోహన్ రావు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.సంక్షేమం, అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యంమెట్‌పల్లి రూరల్: తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సంక్షేమం తో పాటు అభివృద్ధి సాధ్యమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకంట్ల విద్యాసాగర్‌రావు అ న్నారు. మంగళవారం మెట్‌పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో మండలంలోని మహిళలకు బతుకమ్మ చీరలు, గ్రామాలకు కేసీఆర్ అందజేసిన ఆట వస్తువులను ఎంపీపీ మారు సాయిరెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గంలో పెటిపెరిగిన నన్ను మీరు ఆశీర్వ దించడంతో నాలుగు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిపించిన మీ నమ్మకంతో నియోజక వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను. రాష్ట్రంలోని ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని సంక్షేమ పథకాలను అమలు చేసి గౌరవాన్ని కల్పించారు. రానున్న ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్‌ను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భీమెష్‌రెడ్డి, ఎంపీ వో మహెశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.