తెలంగాణ వీణ , హైదరాబాద్ : కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయాలంటే నీ సహాయం ఎం దుకు? నీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? నీ బలమెంత? వంద మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది మాకు. కేసీఆర్ అనుకుంటే ఎమ్మెల్యేల బలంతో కేటీఆర్‌ను సీఎంగా చేయొచ్చు. ఇందులో నీ బోడి సాయం ఎవడికి కావాలి’ అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ అబద్ధాల కోరు అని విమర్శించారు.సీఎం కేసీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేయ డం దుర్మార్గమని మండిపడ్డారు. ‘ఎన్డీఏలో కలుస్తానని కేసీఆర్ చెప్ప డం పచ్చి అబద్ధం. ఎన్డీఏలో కలవమని మీరు బతిమిలాడితే దేశాన్ని అమ్మే వారితో కలువబోమని కేసీఆర్ కరాఖండిగా చెప్పారు’ అని పేర్కొన్నారు.కేసీఆర్‌పై ఎన్నికల వేళ అవినీతి ఆరోపణలు చేస్తున్న నీవు ఇన్ని రోజులు ఏమి చేశావు? దర్యాప్తు సంస్థలన్నీ నీ జేబులోనే ఉన్నాయి కదా’ అని ప్రశ్నించారు. తన మిత్రులైన కార్పొరేట్లకు రూ.12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేసి, ఆ అక్రమ డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ‘తెలంగాణ అంటేనే నరనరాన విషం నింపుకున్న మోదీ రాష్ర్టానికి చేసింది శూన్యం. ఆయన తెలంగాణ అభివృద్ధికి బద్ధ వ్యతిరేకి. నిజామాబాద్‌లో కేసీఆర్ నిర్మించిన కలెక్టరేట్, కేటీఆర్ నిర్మించిన ఐటీ టవర్‌ను చూసి కన్ను కుట్టి ఏవేవో కహానీలు చెప్పారు’ అని ధ్వజమెత్తారు.