తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి దేశ అత్యున్నత న్యాయ స్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలుచేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన రేవంత్‌రెడ్డి చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం దాఖలు చేస్తూ వచ్చిన కేసులు వీగిపోతూ ఉన్నాయి. తొలుత ట్రయల్ కోర్టు, ఆపై హైకోర్టు, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయనకు చుక్కెదురైంది. రేవంత్‌రెడ్డి దాఖలుచేసిన రెండు వ్యాజ్యాలను న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం మంగళవారం కొట్టివేసింది.