తెలంగాణ వీణ , క్రీడలు : టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ(MS Dhoni).. ఇప్పుడు కొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు. చాలా స్టయిలిస్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తున్నాడు. కొత్త తరహా హెయిర్ స్టయిల్‌తో డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో టార్జన్ తరహా హెయిర్ స్టయిల్‌తో కిక్ ఇచ్చిన ధోనీ, మళ్లీ ఇప్పుడు దాదాపు అలాంటి హెయిర్ స్టయిల్‌తో దర్శనమిచ్చాడు. ఓ యాడ్ షూట్ కోసం ధోనీ తన తల వెంట్రుకల్ని పెంచేశాడు. ఆలిమ్ హకిమ్ అనే హెయిర్ స్టయిలిస్ట్.. ధోనీకి చెందిన కొత్త ఫోటోలను తన ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశాడు. అయితే కొత్త లుక్ కోసం తాను, ధోనీ ఎలా పనిచేశారో ఆ పోస్టులో చెప్పాడతను. మహిభాయ్‌తో పనిచేయడం సంతోషంగా ఉందని, అతని హెయిర్‌ను స్టయిల్‌గా తయారు చేసేందుకు చాలా ప్లాన్ చేశామన్నాడు. యాడ్ షూట్ చేయడానికి ముందు తీసిన ఫోటోలను అతను ఇన్‌స్టాలో పెట్టాడు.