తెలంగాణ వీణ , క్రీడలు : పుష్కర కాలం తర్వాత భారత్‌లో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ తొలి పోరులో (అక్టోబర్ 8న; చెన్నై వేదికగా) ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుండగా.. అంతకుముందు రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. అందులో భాగంగా గత శనివారం గువాహటిలో ఇంగ్లండ్‌తో ప్రాక్టీస్ పోరులో అస్త్రశస్త్రాలను సరిచూసుకుందాం అనుకుంటే.. వరుణుడు ఆ అవకాశమే ఇవ్వలేదు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆ తర్వాత చినుకులతో ప్రారంభమైన వాన.. కాసేపట్లోనే మైదానాన్ని ముంచెత్తింది. దీంతో కీలక పోరును రద్దు చేయక తప్పలేదు. ఇప్పుడు తిరువనంతపురం మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డుపడేలా కనిపిస్తున్నాడు.