తెలంగాణ వీణ , క్రీడలు : ఆసియా క్రీడలు-2023లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు 13 స్వర్ణాలు, 21 వెండి, 21 కాంస్యాలు కైవసం చేసుకుంది.కాగా అత్యధికంగా గెలిచిన విషయం తెలిసిందే. అథ్లెటిక్స్‌లో 9, షూటింగ్‌లో 3, బ్యాడ్మింటన్, గోల్ఫ్, బాక్సింగ్‌లో ఒక్కో పతకం సాధించారు. ఇక సోమవారం(అక్టోబరు 2) నాటి విశేషాలు తెలుసుకుందాం! టేబుల్ టెన్నిస్ వుమెన్స్ డబుల్స్ విభాగంలో భారత్‌కు బ్రాంజ్ మెడల్ లభించింది. సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ సోమవారం నాటి మ్యాచ్‌లో గెలుపొంది ఆసియా క్రీడల్లో టేబుల్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో భారత్‌కు తొట్టతొలి పతకం అందించారు. తద్వారా ముఖర్జీ సిస్టర్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు