తెలంగాణ వీణ , సినిమా : సంక్రాంతి పండగను ఆర్నెళ్ల ముందే లాక్ చేసుకున్న సినిమా గుంటూరు కారం. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఈ సారి చెప్పిన డేట్ కన్ఫార్మ్ అని పదే పదే మేకర్స్ చెబుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి నిర్మాత నాగవంశీ కూడా సంక్రాంతికే ఫిక్స్ అని బల్లగుద్ది చెప్పాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. నాలుగు పాటలకు సంబంధించిన మేకింగ్‌తో పాటు ఓ చిన్న టాకీ పార్టు ఉందట. త్రివిక్రమ్ ఈ సారి బాబును మాములుగా చూపించట్లేదని ఇన్‌సైడ్ టాక్. అతడు, ఖలేజా సినిమాలో క్యారెక్టర్‌లకు మాస్ తోడైతే ఏ రేంజ్‌లో ఉంటుందో మహేష్ రోల్ ఆ రేంజ్‌లో ఉంటుందట. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ పూర్తయినట్లు నాగవంశీ వెల్లడించాడు. నైజాం రైట్స్‌ను దిల్‌రాజు దక్కించుకున్నాడట. సరైన నెంబర్ చెప్పలేదు కానీ.. ఇండస్ట్రీ టాక్ ప్రకారం రూ.45 కోట్లని సమాచారం. ఇక దిల్‌రాజు సినిమాకు సంబంధించిన కొన్ని రషెస్ చూశాడట. అవి చూసిన తర్వాత సంక్రాంతికి సరైన బొమ్మ ఇదేనని ఈ రేటు పెట్టాడట. ఇక మాములుగా దిల్‌రాజు అంటేనే సక్సెస్‌కు ఎగ్జాంపుల్. ఒకటి రెండు సినిమాలను జడ్జ్ చేయడంలో లెక్క తప్పాడు కానీ.. ఆయన జడ్జిమెంట్‌కు తిరుగుండదు. అలాంటి మనిషి గుంటూరు కారం సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడంటే మహేష్ అభిమానులు సినిమా వేరే లెవల్లో ఉండబోతుందని ఫిక్సయిపోయారు.
Previous article
Next article
RELATED ARTICLES
మోహన్ బాబు ఎక్కడున్నారో తెలియదంటున్న పోలీసులు
తెలంగాణవీణ,హైదరాబాద్ : మంచు ఫ్యామిలీ వివాదంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. కుటుంబంలో జరిగిన గొడవపై మంచు కుటుంబ సభ్యులు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే....
అమెరికాలో తీవ్ర విషాదం.. తెలుగు యువతి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రాణాలు కోల్పోయి. తెనాలికి చెందిన నాగశ్రీవందన పరిమళ ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లారు. అమెరికాలోని...
అల్లు అర్జున్ అరెస్ట్ పై కేటీఆర్ స్పందన
తెలంగాణవీణ, హైదరాబాద్ : హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. జాతీయ అవార్డు విజేత అల్లు...