మెగాస్టార్ చిరు ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్ఠతో సోషియో ఫాంటసీ సినిమాకు రెడీ అవుతున్నాడు. టైటిల్ పోస్టర్‌తోనే ఈ సినిమాపై తిరుగులేని అంచనాలు నెలకొల్పాయి. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్లో చూపిస్తూ మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇక దీనితో పాటు సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. అయితే ముందుగా దేన్ని పట్టాలెక్కిస్తాడో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇక తాజాగా చిరు కొత్త సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. చిరు తన నెక్స్ట్ సినిమాను బోయపాటితో చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య బోయపాటి చిరుకు ఓ లైన్ చెప్పాడట. అది బాగా నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసి తీసుకురమ్మన్నాడట. ఇక చిరుకు ఫైనల్ నెరేషన్ నచ్చితే ఈ సినిమా పట్టాలెక్కే చాన్స్ ఉందట. అంతేకాకుండా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించాలని బోయ ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో నిజమెతుందో తెలియదు కానీ ఈ వార్త సోషల్ మీడియాను ఊపేస్తుంది.
Previous article
Next article
RELATED ARTICLES
దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణ వీణ, హైదరాబాద్ : అక్టోబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ.
అక్టోబర్ 12న దసరా పండుగ
అక్టోబర్ 2 నుంచి...
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్
తెలంగాణ వీణ, హైదరాబాద్ : గత మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న డాన్స్ మాస్టర్ జానీ ని హైదరాబాద్ ఎస్ఓటీ, పోలీసులు బెంగళూరులో ఈరోజు ఉదయం...
లైంగిక వేదింపులకు పాల్పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్
తెలంగాణ వీణ, హైదరాబాద్ :మలయాళ సినీ రంగంలో పలువురు నటీమణులు లైంగిక ఆరోపణలు చేస్తూ సంచలన విషయాలను బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే...