తెలంగాణ వీణ , సినిమా : నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి కలిసి నటిస్తోన్న తాజా చిత్రం మంత్ ఆఫ్ మధు. ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గతంలో వీరిద్దరూ త్రిపుర చిత్రంలో జంటగా కనిపించారు. మరోసారి వెండితెరపై జంటగా ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. మూవీ ప్రమోషన్లలో భాగంగా నవీన్ చంద్ర, స్వాతి వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రెస్ మీట్‌లో స్వాతిపై నవీన్ చంద్ర ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో అతని మాటలు విన్న కలర్స్ స్వాతి ఫుల్ ఎమోషనలయ్యారు.