తెలంగాణ వీణ , జాతీయం : మహిళా రిజర్వేషన్ బిల్లు తప్పకుండా అమలు చేస్తామని మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ తెలిపారు. కోయంబత్తూర్‌లో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ… మహిళా బిల్లు అమలు చేయలేరని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం వ్యాఖ్యానిస్తున్నారని, ప్రస్తుతం కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ కాదని, బీజేపీ అని ఆయన గుర్తెరగాలన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనేదే ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యమన్నారు. ఇటీవల జరిగిన జీ20 సదస్సుల్లో పాల్గొన్న ప్రపంచ దేశాల నేతలకు స్వదేశీ వస్తువులను ప్రధాని మోదీ బహుమతిగా అందజేశారని, ప్రజలు కూడా స్వదేశీ వస్తువులను అధికంగా కొనుగోలు చేయాలని వానతి శ్రీనివాసన్ పిలుపునిచ్చారు.