తెలంగాణ వీణ , జాతీయం : గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్ నగరంలోని బాంబే మార్కెట్లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.