రామగుండంలో అధికార పార్టీ బీఆర్‌ఎసకు గట్టి షాక్ తగిలింది. పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై సంధ్యారాణి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే చందర్ తమ కాళ్ళు పట్టుకున్నారన్నారు. కోరుకంటి చందర్‌ను 2018 లో చందాలు వేసుకొని గెలిపించామని చెప్పుకొచ్చారు.
రామగుండంలో అధికార పార్టీ బీఆర్‌ఎసకు గట్టి షాక్ తగిలింది. పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై సంధ్యారాణి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే చందర్ తమ కాళ్ళు పట్టుకున్నారన్నారు. కోరుకంటి చందర్‌ను 2018 లో చందాలు వేసుకొని గెలిపించామని చెప్పుకొచ్చారు. చందర్ గెలిచిన తర్వాత రామగుండంలో ఆర్‌ఎఫ్‌సీఎల్ బూడిద, ఇసుక, ఉద్యోగాలలో కోట్లు దండుకున్నారని ఆరోపించారు. 20 ఏళ్లుగా తనను అవమానపరస్తున్నారంటూ సంధ్యారాణి కంటతడిపెట్టారు. రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు. కొంగు చాపి అడుగుతున్న రామగుండం ప్రజలు అవకాశం ఇవ్వాలని సంధ్యారాణి కోరారు.