తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : రేపు ఉదయం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయవాడ రానున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకి ఆయన హాజరు కానున్నారు. సెప్టెంబర్ 30న ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఆర్పీసీ 41ఏ కింద ఢిల్లీలో ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలో రాష్ట్రపతి, న్యాయవాదులు,రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధుల దృష్టికి టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని లోకేష్ తీసుకెళ్లారు. పార్లమెంట్ గాంధీ విగ్రహం, రాజ్ ఘాట్, టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్,కనకమేడల రవీంద్ర కుమార్ నివాసంలో నిరసన కార్యక్రమాల్లో నారా లోకేష్ పాల్గొన్నారు.