తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : మంత్రి రోజాపై (Minister Roja) అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణను (Former Minister Bandaru Satyanarayana) పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి పీతల సుజాత (Former Minister Peethala Sujatha) తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి చేసే వ్యక్తి చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారని.. అరాచకాలు చేసే వ్యక్తి బయట ఉన్నారన్నారు. ఎప్పుడు బయటకు రాని భువనేశ్వరి రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం దీక్ష చేశారన్నారు. జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని పీతల సుజాత హెచ్చరించారు. కాగా.. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బండారుపై పోలీసులు కేసు నమోదు చేసి గుంటూరుకు తరలించారు. ఈరోజు తెల్లవారు జామున 3 గంటలకు గుంటూరు చేరుకోగా.. నగరం పాలెం స్టేషన్‌లో బండారును ఉంచారు. ఈ క్రమంలో నగరం పాలెం స్టేషన్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. మంజుల అనే వైసీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు నగరం పాలెం స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఐపీసీ సెక్షన్ 153ఏ, 504, 354ఏ, కింద కేసు, 505, 506, 509, 499 , ఐటీ సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు.మరోవైపు నగరం పాలెం స్టేషన్ వద్ద మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కొడుకు పడిగాపులు కాస్తున్నారు. బండారు కొడుకు అప్పలనాయుడుతన తండ్రికి మందులు తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అయితే లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బండారు కొడుకు స్టేషన్ ముందే పడిగాపులు కాస్తున్నారు.