తెలంగాణ వీణ , హైదరాబాద్ :కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా పరోక్షంగా బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ చూస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం గాందీభవన్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, నేతలు అంజన్‌కుమార్‌యాదవ్, చిన్నారెడ్డి, పుష్పలీల, కైలాశ్, రోహిణ్‌రెడ్డితో కలిసి రేవంత్ మీడియాతో మాట్లాడారు.కేసీఆర్ కు టుంబ అవినీతి గురించి గతంలో పదేపదే మా ట్లాడిన మోదీ ఆ అవినీతిని బయటకు తెస్తామ ని ఎందుకు హామీ ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. కాళేశ్వరం కుంభకోణం, ఢిల్లీ లిక్కర్ స్కాంలకు గురించి ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలతోనే బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య చీకటి ఒప్పందం ఉందన్న విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు.ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే తెలంగాణలో మోదీ పర్యటనలకు వస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను బిల్లా, రంగాలతో రేవంత్‌రెడ్డి పోల్చారు.’’వీరికి ఇంగిత జ్ఞానం లేదు. కాంగ్రెస్‌ను విమర్శించే నైతిక అర్హత వారికి లేదు. నేను వారికి సూటిగా సవాల్ విసురుతున్నా. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనపై, 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ పాలనపై, ప్రజలకు ఇచి్చన హామీలపై చర్చకు సిద్ధమా?’అని ప్రశ్నించారు.