తెలంగాణ వీణ , సినిమా : కోలీవుడ్‌లో బిగ్ బాస్ ఏడవ సీజన్ తాజగా ప్రారంభమైంది. తెలుగులో నాగార్జున హోస్ట్ చేస్తుండగా తమిళ్‌లో గ్లోబల్ హీరో కమల్ హాసన్ లీడ్ చేస్తున్నారు. బిగ్‌బాస్‌లోకి ‘మాయా కృష్ణన్’ 12వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. విక్రమ్ సినిమాలో తన సౌండ్ బోట్‌తో అభిమానులను ఉర్రూతలూగించిన నటి మాయ కృష్ణన్. దీంతో ఆమె ఇండియా మెత్తం పాపులర్ అయింది. వనవిల్ జీవన్, రజనీకాంత్ 2.ఓ, మకళిర్ గహను, సైరిగి, విక్రమ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో ఆమె నటించింది. విక్రమ్ సినిమాలో కాల్ గర్ల్ క్యారెక్టర్ చేసిన తర్వాత ఆ…హమ్‌తో క్రేజీ గుర్తింపు తెచ్చుకుంది.
స్టేజీపైన హీరో కమల్ హాసన్‌ను చూడగానే ఆమె ఒక్కసారిగా కౌగిలించుకుంది. తన స్వస్థలం మధురై. చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఛాన్స్‌లు సంపాదించాలనే తపనతో చెన్నైలో స్థిరపడినట్లు తెలిపింది. కానీ చాలా రోజుల వరకు తనకు ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో కనీసం ఉద్యోగం అయినా చేద్దామని ఎన్నో ఆఫీసుల చుట్టు తిరిగానని చెప్పుకొచ్చింది. విక్రమ్ సినిమాతో మంచి గుర్తింపు వచ్చాక ఇప్పుడు భారీగానే సినిమా అవకాశాలు వస్తున్నాయని ఆమె తెలిపింది.