తెలంగాణ వీణ , సినిమా :జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’ వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ ఇక గతేడాది చివర్లో ఉన్ని నటించిన మాలికాపురం అనే చిత్రం చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది.
October 2, 2023 / 01:08 PM IST
Unni Mukundan | ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’ వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan). ఇక గతేడాది చివర్లో ఉన్ని నటించిన మాలికాపురం (Malikapuram) అనే చిత్రం చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది. 5 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్‌లు సాధించి రికార్డు సాధించింది. ఇదిలా ఉంటే ఉన్ని ముకుందన్ నటిస్తున్న తాజా చిత్రం మార్కో (Marco). మైఖేల్, ది గ్రేట్ ఫాదర్ సినిమాల ఫేమ్ హనీఫ్ అదేని (Haneef Adeni) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ జానర్‌లో రానున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు.