తెలంగాణ వీణ , హైదరాబాద్ :గాంధీ జయంతి, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారి చిత్రపటాలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, సోమువీర్రాజు పుష్పాంజలి ఘటించారు.
అనంతరం పురందేశ్వరి మాట్లాడుతూ.. ఇద్దరు మహాత్ములు ఈరోజు జన్మించారని.. మహాత్ముని ఆశాయాలు కొనసాగించినప్పుడే వారికి నిజమైన నివాళి అని అన్నారు. ఈ రోజన జాతీయవాదం అనే పదానికి అర్థం లేకుండా ఉందన్నారు. ప్రాంతీయవాదంతో జాతీయ భావన లేకుండా పోతోందని పలువురు భావిస్తున్నారని తెలిపారు. అసహనం ద్వారా హింస పెరిగిపోతుందన్నారు. దేశవ్యాప్తంగా అని చెప్పను కానీ మన రాష్ట్రంలో అసహనంతో ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని తెలిపారు. గ్రామాలపట్ల మన రాష్ట్రంలో చిన్నచూపు చూస్తున్నారని… గ్రామాభివృద్ధి లేదని.. రోడ్లు, మౌళిక వసతులు లేవని అన్నారు. నాణ్యత లేని మద్యాన్ని అమ్ముతూ డబ్బు దండుకొనేందుకు జేబులు నింపుకొనే ఆలోచన ఏపీ చూస్తున్నామన్నారు. బీజేపీ గాంధీ ఆలోచనలను కొనసాగిస్తోందన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మధ్యపాన నిషేధం అంశం మ్యానిఫెస్టోలో పెట్టడంపై చర్చించుకొని ప్రకటిస్తామని అన్నారు. నంరేంద్ర మోదీ పుట్టిన రోజు నుంచి గాంధీ జయంతి వరకు సేవ చేయాలని బీజేపీ పిలుపునిచ్చిందని ఏపీ బీజేపీ చీఫ్ పేర్కొన్నారు.