తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : భారత దేశ మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 119వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర సమర యోధుడిగా, మాజీ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రిగారు
దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా గుర్తు చేశారాయాయన.
జై జవాన్, జై కిసాన్’ అంటూ ఆయన ఇచ్చిన పిలుపు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆయన తీసుకున్న ఎన్నోవిప్లవాత్మక సంస్కరణలు
దేశాన్ని శిఖరాగ్రాన నిలిపాయి. నేడు లాల్ బహదూర్ శాస్త్రిగారి జయంతి సందర్భంగా నివాళులు అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.