తెలంగాణ వీణ , సినిమా : నాని 30 గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే హాయ్ నాన్న నుంచి మేకర్స్ లాంఛ్ చేసిన టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ మూవీ నుంచి సమయమా సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో లాంఛ్ చేసిన ఈ పాటలో హీరోహీరోయిన్లు ప్రకృతిని ఆస్వాదిస్తూ.. చిల్ అవుట్ అవుతున్నారు. మలయాళం కంపోజర్, హృదయం ఫేం హేశమ్ అబ్దుల్ వహబ్ అందించబోతున్న హాయ్ నాన్న మ్యూజికల్ ట్రీట్ అద్భుతంగా ఉండబోతుందని ఫస్ట్ సింగిల్ ట్యూన్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు. కాగా మేకర్స్ కూల్ లుక్ ఒకటి విడుదల చేశారు.