తెలంగాణ వీణ , సినిమా : కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రాల్లో ఒకటి అయలాన్ . ఆర్ రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న అయలాన్‌లో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన అయలాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. శివకార్తికేయన్ గగనంలో విహరిస్తుండగా.. అతడితోపాటే ఏలియన్ కూడా వెళ్తున్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. తాజాగా అయలాన్ రిలీజ్ అప్‌డేట్ అందించారు మేకర్స్. ఈ చిత్రాన్ని పొంగళ్ 2024 కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో సాగే సినిమాలో శివకార్తికేయన్ డిఫరెంట్ అవతార్‌లో ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడని ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి. ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.