తెలంగాణ వీణ , జాతీయం :ఉత్తరప్రదేశ్ పోలీసులు వికలాంగురాలైన ఓ మహిళపట్ల అమానవీయంగా వ్యవహరించారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు బాధితురాలి చేతులు పట్టుకుని ఓ బస్తాను ఈడ్చుకెళ్లినట్లు ఈడ్చుకెళ్లారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లాలో సాక్షాత్తు జిల్లా ఎస్పీ కార్యాలయం పరిసరాల్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనపై నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వికలాంగురాలైన ఓ మహిళ తన భర్తతో ఉన్న వివాదంపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చింది. అయితే, పోలీసులు ఆమెను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.